Header Banner

జీవో నెం.3ను చంపింది వైసీపీనే.. వాళ్ల మాటలు నమ్మవద్దు! మంత్రి సంధ్యారాణి హెచ్చరిక!

  Fri May 02, 2025 15:17        Politics

ఉద్యోగుల విషయంలో ఆదివాసీ గిరిజన యువత (Adivasi tribal youth) అధైర్యపడొద్దని.. ఎవరి మాటలు విని, నమ్మి మోసపోవద్దని.. వైసీపీ రాజకీయ ఆట (YCP Political Game)లో నిరుద్యోగ యువత (Unemployed youth) పావులుగా మారొద్దని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి (Minister Gummidi Sandhyarani) అన్నారు. అరుకు (Aruku)లో ఆదివాసీ విద్యార్ధుల బంద్‌పై మంత్రి సంధ్యారాణి స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలోనే గిరిజనులకు న్యాయం జరుగుతుందని అన్నారు. 16,437 డీఎస్సీ (DSC) పోస్టులలో 2,024 పోస్టులు గిరిజనులకే కేటాయించడం జరిగిందని చెప్పారు. ఇప్పుడు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయమని డిమాండ్ చేయడం భావ్యమా అని ప్రశ్నించారు.

వైసీపీ ఆ జీవోను చంపేసింది..
జీవో నెం. 3ను పూర్తిగా నిర్వీర్యం చేసి, ఆ జీవోను చంపేసింది గత వైసీపీ ప్రభుత్వమేనని, వైసీపీ హయాంలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా తీయని వారి మాటలు నమ్మవద్దని మంత్రి గమ్మిడి సంధ్యారాణి అన్నారు. జీవో నెం. 3కి ప్రత్యామ్నాయ జీవోను తీసుకువస్తామనే మాటకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గిరిజన నిరుద్యోగులకు అన్ని విధాల సహాయంగా కూటమి ప్రభుత్వం ఉంటుందని మంత్రి సంధ్యారాణి చెప్పారు. వైసీపీ ఉచ్చులో పడొద్దు.. వైసీపీ ఉచ్చులో పడొద్దని ఉపాధ్యాయ ఉద్యోగ అభ్యర్ధులకు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి హితవు పలికారు. గత ఐదేళ్లు డీఎస్సీ అభ్యర్ధులు అనుభవించిన నరకానికి కూటమి ప్రభుత్వం మోక్షం కలిగించిందన్నారు.
వైసీపీ హయాంలో ఎన్ని పోరాటాలు చేసినా స్పందన కరువైనా, కూటమి ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన డీఎస్సీ రద్దు చేయమని ఆందోళన చేయటం ఎంత వరకు సమంజసమన్నారు. కాగా ప్రత్యేక ఏజెన్సీ డీఎస్సీ సాధన కొరకు అల్లూరి జిల్లా అరకులోయలో ఆదివాసీ స్పెషల్ డీఎస్సీ సాధన కమిటీ, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం రాష్ట్ర మన్య బంద్‌కు పిలుపిచ్చింది. మెగా డిఎస్సీ నుంచి ఏజెన్సీ టీచర్ ప్రాంత పోస్టులు మినహాయింపు ఇవ్వాలని, ఆదివాసి స్పెషల్ డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని.. స్థానిక గిరిజనులకు ఉద్యోగ ఉపాధ్యాయ అవకాశాలు నూరు శాతం కల్పించాలనే తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ బందుకు పిలుపునిచ్చాయి. బంద్ సందర్భంగా ప్రముఖ పర్యాటక కేంద్రాలైన బొర్రా గృహాలు, గిరిజన మ్యూజియం, పద్మాపురం ఉద్యానవన కేంద్రం, చాపరాయి జలపాతం మూతపడనున్నాయి.


ఇది కూడా చదవండి: ప్రధాని వస్తుంటే జగన్‌ జంప్‌! ప్రజల మధ్యకు రాలేక పారిపోయాడు! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. భారత్‌లో 20 వేల ఉద్యోగాలు.. వారికి మాత్రమే ఛాన్స్.. 

 

రూ.500 నోట్లకు ఏమైంది.. ఇక ఎటిఎంలలో 100, 200 నోట్లు.. RBI కీలక నిర్ణయం..!

 

మాజీ మంత్రి బిగ్ షాక్.. విచారణ ప్రారంభం! వెలుగులోకి కీలక ఆధారాలు..

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

 

కొత్త రేషన్ కార్డులపై శుభవార్త చెప్పిన మంత్రి.. ప్రతి కుటుంబానికి ఉచితంగా - తాజాగా కీలక ప్రకటన!

 

6 లైన్లుగా రహదారిడీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

సీఐడీ క‌స్ట‌డీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..

 

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #GO3 #YSRCP #SandhyaRani #APPolitics #TruthExposed #PoliticalWarning #TDPVsYSRCP #AndhraPradesh